Padmavathi University Distance B.Ed Admission 2026 Fee Payment Notice

ఉపాధ్యాయుల హాజరుపై 'నిమిషం' గండం: అపోహలు వద్దు.. స్పష్టత అవసరం!

ఉపాధ్యాయుల హాజరుపై 'నిమిషం' గండం: అపోహలు వద్దు.. స్పష్టత అవసరం!

ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు (FRS) విధానంపై ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అయితే విద్యాశాఖ తాజాగా ఇచ్చిన స్పష్టత ప్రకారం పాత నిబంధనలే కొనసాగుతాయని వెల్లడించింది.

అమరావతి: గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ గుర్తింపు హాజరు (FRS) విషయంలో సోషల్ మీడియాలోనూ, కొన్ని వార్తా పత్రికల్లోనూ వస్తున్న వార్తలు ఉపాధ్యాయ లోకంలో తీవ్ర ఆందోళనకు దారి తీశాయి. ఉదయం 9:00 గంటలు దాటితే చాలు 'గైర్హాజరు' గా పరిగణిస్తారనే ప్రచారం ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేసింది. అయితే దీనిపై విద్యాశాఖ తాజాగా స్పష్టతనిస్తూ పాత నిబంధనలే కొనసాగుతాయని ప్రకటించింది.

అసలేం జరిగింది? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

పాఠశాల విద్యాశాఖ నిబంధనలను కఠినతరం చేస్తూ, ఉదయం 9:00 తర్వాత వచ్చే వారిని 'లేట్ ఇన్'గా కాకుండా నేరుగా 'ఆబ్సెంట్'గా పరిగణిస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కేవలం ఒక్క నిమిషం ఆలస్యమైనా ఒక రోజు సెలవుగా పరిగణించడం సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు.

తాజా స్పష్టత ఇదే

ప్రభుత్వ FRS నోడల్ అధికారులు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం:

  • 10 నిమిషాల గ్రేస్ పీరియడ్: గతంలో ఉన్నట్లుగానే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (ఉదయం 9:10 వరకు) అమల్లోనే ఉంది.
  • గైర్హాజరు కాదు: గ్రేస్ పీరియడ్ లోపు హాజరు నమోదు చేసిన ఉపాధ్యాయులను ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరుగా పరిగణించరు.

యాప్ వైఫల్యాలు - ఉపాధ్యాయుల ఇబ్బందులు

సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ అవ్వడం లేదా సిగ్నల్ అందకపోవడం వంటి కారణాల వల్ల హాజరు నమోదులో ఆలస్యం జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

ప్రభుత్వానికి మరియు ఉన్నతాధికారులకు సూచనలు

  • కక్షసాధింపు ధోరణి వీడాలి: నిబంధనలు క్రమశిక్షణ కోసం ఉండాలి కానీ, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉండకూడదు.
  • సాంకేతికతను మెరుగుపరచాలి: యాప్ సరిగా పని చేయనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా హాజరును ఆమోదించే వెసులుబాటు కల్పించాలి.
  • ఆఫ్లైన్ అటెండెన్స్: నెట్వర్క్ లేకపోయినా అటెండెన్స్ సేవ్ అయ్యి, నెట్వర్క్ వచ్చినప్పుడు సర్వర్‌తో కనెక్ట్ అయ్యే విధంగా వ్యవస్థ ఉండాలి.
  • అధికారిక సమాచారమే ముఖ్యం: స్పష్టమైన మార్గదర్శకాలను అధికారిక వెబ్‌సైట్లలో విడుదల చేయాలి. తద్వారా తప్పుడు ప్రచారం నివారించవచ్చు.
  • ఉపాధ్యాయుల ఆత్మగౌరవం: విద్యా వ్యవస్థకు మూలస్తంభాలైన ఉపాధ్యాయులను కేవలం అటెండెన్స్ యంత్రాలుగా చూడకుండా గౌరవంతో వ్యవహరించాలి.

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం – డిస్టెన్స్ B.Ed అడ్మిషన్ నోటీసు

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ B.Ed చేయుటకు సెలెక్ట్ అయినవారు 26-03-2026 సాయంత్రం ఐదు గంటల లోపు అడ్మిషన్ ఫీజు చెల్లించగలరు.

📄 Merit List PDF

సెలెక్ట్ అయిన అభ్యర్థుల పూర్తి మెరిట్ లిస్ట్ చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి:

B.Ed Merit List

Download Now