(CFMS) లాగిన్‌లో అందుబాటులోకి వచ్చిన బెనిఫిషరీ స్టేట్మెంట్!
సీఎఫ్ఎంఎస్ (CFMS) లాగిన్‌లో అందుబాటులోకి వచ్చిన బెనిఫిషరీ స్టేట్మెంట్!
APCPSEA: ఫ్లాష్ న్యూస్.. సి.పి.ఎస్ ఉద్యోగులకు ముఖ్య గమనిక!
సీఎఫ్ఎంఎస్ (CFMS) లాగిన్‌లో అందుబాటులోకి వచ్చిన బెనిఫిషరీ స్టేట్మెంట్! రాష్ట్రంలోని సి.పి.ఎస్ (CPS) ఉద్యోగులందరూ తమ డీఏ (DA) బకాయిల స్థితిగతులను (DA Arrears - జూలై 2018 మరియు జనవరి 2019) సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఇప్పుడు లభిస్తోంది. మీ బకాయిలు ఎన్ని విడతలుగా బిల్లులు తయారయ్యాయి, ఎన్ని జమ అయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించండి.
సీఎఫ్ఎంఎస్ బెనిఫిషరీ స్టేట్మెంట్ పొందే విధానం:
Step 1: CFMS Login
ముందుగా CFMS Login వెబ్సైట్లోకి వెళ్ళండి

Step 2: Beneficiary Account Statement
అక్కడ ఉన్న Beneficiary Account Statement ఆప్షన్‌ను ఎంచుకోండి.

Step 3: వివరాలు నమోదు చేయండి
మీ Beneficiary Code (మీ CFMS ID) ను నమోదు చేయండి. తేదీలను ఎంచుకోండి (Select From ... To Date). గమనిక: సీఎఫ్ఎంఎస్ అమలులోకి వచ్చిన తేదీ నుండి ప్రస్తుత తేదీ వరకు ఎంచుకోవచ్చు.

Step 4: Display & Download
అనంతరం Display బటన్ మీద క్లిక్ చేయండి. కొద్దిసేపటి తర్వాత మీ బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.

వివరాలను భద్రపరుచుకోవడానికి Download ఆప్షన్‌ను ఉపయోగించి ఫైల్‌ను సేవ్ చేసుకోండి.
దీని ద్వారా మీరు తెలుసుకోగలిగే అంశాలు:
- దీని ద్వారా మీరు తెలుసుకోగలిగే అంశాలు:
- మీ DA Arrears (జూలై 2018 & జనవరి 2019) బిల్లులు ఎన్ని విడతలుగా సిద్ధమయ్యాయి?
- ఎన్ని విడతల నగదు మీ ఖాతాలో జమ అయింది?
- ఇంకా ఎన్ని విడతలు పెండింగ్‌లో (In Progress) ఉన్నాయి?
- ఇతర పెండింగ్ బిల్లుల స్థితిగతులు (Status) కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి.
కావున, సి.పి.ఎస్ ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ బకాయిల వివరాలను సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని APCPSEA టెక్నికల్ expert కాటసాని శివారెడ్డి తెలిపారు.